పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి
-రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ నరసింహ కిషోర్
ఘన స్వాగతం పలికిన త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ వి. అప్పారావు
సాక్షిత రాజమహేంద్రవరం :
రాజమహేంద్రవరం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆకస్మాకి తనిఖీ చేశారు. స్టేషన్ తనిఖీకి వచ్చిన ఎస్పీని స్టేషన్ సీఐ అప్పారావు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతన పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ తనిఖీ లలో భాగంగా పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పరిసరాలను, రిసెప్షన్ కౌంటర్ మరియు స్టేషన్లో గల వివిధ రికార్డులను పరిశీలించి, నమోదైన గ్రేవ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం కేసులకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పోలీస్ స్టేషన్ల లోగల సీసీ కెమెరాలను పరిశీలించి వాటి పనితీరుపై ఆరా తీశారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి గ్రేవ్ కేసులలో పురోగతి సాధించాలని, శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించాలని, అలాగే మద్యం, గంజాయి, నాటుసారా అక్రమ రవాణను నియంత్రించాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ మరియు రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. బ్లూ కోల్డ్స్ మరియు రక్షక్ మొబైల్ గంట గంటకు తమ లొకేషన్ మార్చుకుంటూ అప్రమత్తంగా తిరుగుతూ, తిరుగుతున్న లొకేషన్ కంట్రోల్ రూమ్ వారికి తెలియపరచాలన్నారు. అనంతరం సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.