Peddemul Mandal Mudiraj Welfare Association’s new office opened
పెద్దేముల్ మండలం ముదిరాజ్ సంక్షేమ సంఘం నూతన కార్యాలయము ప్రారంభం
వికారాబాద్ జిల్లా తాండూర్ (సాక్షిత న్యూస్ సిసెంబర్ 6)పెద్దేముల్ మండలం లోని అన్ని గ్రామాల ముదిరాజ్ ల కొరకు, ముదిరాజ్ సంక్షేమ సంఘం,నూతన కార్యాలయం, స్థానిక మండలం బస్టాండ్ దగ్గర ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో పెద్దేముల్ మండలం లోని అన్ని గ్రామాల ముదిరాజ్ లు పాల్గొన్నారు. మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు వీరప్ప ముదిరాజ్ (సర్పంచు గాజీపూర్ )ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఇట్టి కార్యక్రమానికి కల్కోడా నరేష్ ముదిరాజ్,అబ్బని బసయ్య ముదిరాజ్,లొంకనర్సిములు ముదిరాజ్ జిల్లా యూత్ అధ్యక్షులు, అంబరీష్ ముదిరాజ్ జిల్లా కార్యదర్శి,శ్రీకాంత్ ముదిరాజ్ తాండూర్ టౌన్ అధ్యక్షులు,చర్ల రాములు ముదిరాజ్, బోయిని నర్సిములు ముదిరాజ్ మండలం ఉపాధ్యక్షులు, బంధమీది పల్లి మల్లేశం ముదిరాజ్ మండలం కార్యదర్శి.బుద్దరం ఆనంద్ ము దిరాజ్, బుద్దారం శ్రీనివాస్ ముదిరాజ్, పాల్గొన్నారు.ఈసందర్బంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ములో 60 లక్షల మంది ముదిరాజ్ లు ఉన్నారన్నారు, ప్రతి రాజకీయ పార్టీలు ముదిరాజ్ లను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు, ముదిరాజ్ లు ఐక్య మత్యా మైతే ఏపార్టీ ఐనా ఏమిచేయలేదని, ఇప్పటి నుండి ముదిరాజ్ లను రాజకీయ చైతన్యం ప్రతి గ్రామం లో చేయవలసిన అవసరం ఉందని తెలిపారు.