SAKSHITHA NEWS

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మందమర్రి మండలం క్యాతన్‌పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిని సందర్శించి, ప్రాజెక్ట్ ప్రగతిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ మరియు సంబంధిత అధికారులతో బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం అవకుండా, పని వేగవంతంగా సాగాలనే దిశగా ఎంపీ అధికారులకు తగిన సూచనలు చేశారు.

ప్రజలకు రవాణా సౌకర్యం సకాలంలో అందించడంలో బ్రిడ్జి నిర్మాణ ప్రాముఖ్యతను గుర్తుచేసిన ఎంపీ , ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించడానికి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానికులు, కార్యకర్తలు పాల్గొని ఎంపీ పర్యటనకు మద్దతుగా నిలిచారు.

అదేవిధంగా, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ STPP (సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్) జనరల్ మేనేజర్‌కి ఆదేశాలు జారీ చేశారు. క్యాతన్‌పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన ఫ్లై యాష్ సరఫరా చేయాలని, నిర్మాణ పనులు నిరంతరాయంగా జరగాలనే ఉద్దేశంతో ఫ్లై యాష్ సమయానికి అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

ఈ నిర్ణయంతో బ్రిడ్జి నిర్మాణం వేగవంతం కావడమే కాకుండా, ఫ్లై యాష్ వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడనుందని ఎంపీ అభిప్రాయపడ్డారు.


SAKSHITHA NEWS