Pawan Kalyan sworn in as AP state minister
కృష్ణాజిల్లా :
కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ మంత్రిగా పవన్ తన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. పవన్‌తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
సీఎంగా చంద్రబాబు ప్రమా ణ స్వీకారం చేసిన వెంటనే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారా నంతరం వేదికపై ఆశీనులైన అతిథులందరికీ నమస్కరిం చారు.
ఇక తన సోదరుడు మెగా స్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించడం ఆసక్తికరంగా అనిపించింది. పవన్‌ను చిరు ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెల కు హత్తుకున్నారు. ఈ దృశ్యం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేటు తాకనీయబోమన్న వారికి ఓ రేంజ్ సమాధానం అయితే పవన్ చెప్పారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఫిక్స్ అయినట్టు పక్కా సమాచారం.
వాస్తవానికి ఆయన విజ యం కూడా ఓ అద్భుతమే. 70 వేలకు పైగా మెజారిటీ తో పిఠాపురం నుంచి విజ యం సాధించారు. ఇంత మెజారిటీ అంటే మాటలు కాదు. పిఠాపురంలో పవన్ గెలవరంటూ వైసీపీ నేతలు నానా రచ్చ చేశారు.
తను మాత్రమే కాదు.. తన పార్టీ తరుఫున బరిలో నిలి చిన వారందరినీ గెలిపించు కున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకార మహోత్స వానికి ప్రధాని నరేంద్ర మోదీ.. కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ మహారాష్ట్ర సీఎం ఏక్‌నాళథ్ షిండే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీజేఐ ఎన్వీ రమణ తదిత రులు హాజరయ్యారు.
ఇక సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు సూపర్‌స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు…