రైతుల సంపద పెంచాలన్న ఆలోచనలో భాగమే.. ‘రైతన్నా మీకోసం’. ప్రత్తిపాటి
- గ్రామ స్థాయిలో మూడుపార్టీల శ్రేణులు ఐక్యంగా ఉంటేనే ప్రజలకు మేలు.. వారికి న్యాయం జరుగుతాయి.
- అభివృద్ధి పనులు చేసేవారికి కాస్త ఆలస్యమైనా బిల్లులు అందించే బాధ్యత నాది.
- నాదెండ్ల మండలం సాతులూరు, చందవరం గ్రామాల్లో రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి ప్రత్తిపాటి.
వ్యవసాయాన్ని పండుగగా మార్చి, రైతులకు మేలు చేకూర్చాలన్న గొప్ప సంకల్పంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన సాగు విధానాలను ప్రవేశపెట్టి, వాటిపై వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా రైతాంగానికి అవగాహన కల్పించే కార్యక్రమం తలపెట్టారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
శుక్రవారం నాదెండ్ల మండలం సాతులూరు, చందవరంలో నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాటి.. రైతుల్ని కలిసి వారితో మాట్లాడారు. పత్తి కొనుగోళ్లలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని రైతులు ప్రత్తిపాటికి తెలియచేయగా, సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు. రైతుల్ని కలిసి మాట్లాడిన అనంతరం.. గ్రామస్తుల్ని ఉద్దేశించి ప్రత్తిపాటి మాట్లాడారు. రాష్ట్ర రైతాంగం పరిస్థితి ఈ ఏడాది బాగోలేదన్న ప్రత్తిపాటి.. తుపాన్ల వల్ల అన్నిపంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారన్నారు. నష్టపోయిన రైతులకు న్యాయంచేసి, రాబోయే రోజుల్లో వారి సంపద పెంచాలన్న గొప్ప ఆలోచనతోనే ముఖ్యమంత్రి రైతన్నా మీకోసం కార్యక్రమం చేపట్టారని ప్రత్తిపాటి చెప్పారు.
చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి జరిగితే మూడు పార్టీలకు న్యాయం
పార్టీలు, కులమతాలకు అతీతంగా గ్రామాలు ఐక్యంగా ఉంటే ముఖ్యమంత్రి సాధించాలనుకుంటున్న రాష్ట్రాభివృద్ధి తక్కువ సమయంలోనే సాధ్యమవుతుందని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. గ్రామనాయకుల మధ్య అభిప్రాయబేధాలు ఏపార్టీకి మంచివి కావన్న ప్రత్తిపాటి, టీడీపీ శ్రేణుల్లో ఏడాదిన్నరలోనే అసంతృప్తి రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆలోచిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో, రాష్ట్రం అన్నిరంగాల్లో వేగంగా అభివృద్ధి చెందితే మూడుపార్టీల శ్రేణులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని ఈ విషయాన్ని నాయకులు, కార్యకర్తలు గుర్తించాలని ప్రత్తిపాటి సూచించారు.
చంద్రబాబు కష్టం, లోకేశ్ శ్రమ, పవన్ కల్యాణ్ ఆలోచనలు గ్రహించి, మూడు పార్టీల శ్రేణులు సంయమనం తో, సహనంతో వ్యవహరించాలన్నారు. మనమధ్య అభిప్రాయబేధాలు, మనస్పర్థలు వస్తే అది వైసీపీకి లాభం కలిగిస్తుందని, దాంతో మనందరి భవిష్యత్ కు నష్టం వాటిల్లుంతనే నిజాన్ని గ్రహించాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పరిస్థితి ఆర్థికంగా బాగోలేనందున అభివృద్ధిపనులు చేసేవారికి సంవత్సరంలో బిల్లులు మంజూరవుతాయని, ఎవరూ నష్టపోకుండా చూసే బాధ్యత తనదని ఈసందర్భంగా ప్రత్తిపాటి హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజి మధన్ మోహన్, రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, టీడీపీ నాయకులు గుర్రం నాగపూర్ణ చంద్రరావు, వెంకట రామిరెడ్డి, సాతులూరు గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

