
కాలుష్యం ఇబ్బంది పెడుతున్న పార్లమెంట్ సమావేశాలు ఢిల్లీలోనే పెడుతున్నారని, ఇకనైనా వాటిని హైదరాబాద్‌లో నిర్వహించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. దక్షిణాదికి న్యాయం జరగడంలేదని, ఇలా అయితే ప్రత్యేక దేశం కోసం పోరాడే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ఇక్కడి తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై సీబీఐ దర్యాప్తు చేయాలన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఆపేందుకు ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. జనసేనను బీజేపీలో విలీనం చేసే పని జరుగుతోందని, అందుకే పవన్‌కల్యాణ్ సనాతన ధర్మం, లడ్డూల గురించి మాట్లాడుతున్నారని కేఏ పాల్ విమర్శించారు.
