ఇటీవల నూతనంగా ప్రతిష్టించబడిన శ్రీ నవగ్రహ సహిత పంచముఖి ఆంజనేయ స్వామి

Sakshitha news

ఇటీవల నూతనంగా ప్రతిష్టించబడిన శ్రీ నవగ్రహ సహిత పంచముఖి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న స్థానిక కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్…..

సాక్షిత : కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ మహాదేవపురం డివిజన్ పరిధిలోని సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఇటీవల నూతనంగా ప్రతిష్టించబడిన శ్రీ నవగ్రహ సహిత పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ పంచముఖి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆ స్వామివారి దివ్య ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు..

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కి శాలువాతో సత్కరించి ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు…

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రసాద్ దుగ్యాల, రవీందర్ రెడ్డి, దిలీప్ కుమార్, సింహాచలం, వెంకట్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాధాకృష్ణ సత్యనారాయణ, సత్యం తదితరులు పాల్గొన్నారు

Scroll to Top