పంచాయితీరాజ్ – రూరల్ డెవలప్మెండ్
సాక్షిత:- అనకాపల్లి జిల్లా పరవాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పరవాడ మండల ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు అధ్యక్షతన గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక జి.ఆర్. డి.పి తయారీ పై ఎం.పి.టి.సి లకు, సర్పంచ్ లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ.ఓ.పి.ఆర్ &ఆర్.డి ధర్మారావు సభ్యులుకు గ్రామ అభివృద్ధి ప్రణాళికలు ఏ విధంగా తయారు చేయాలని,అదే విధంగా కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాల నిధులు ఏ విధంగా ఖర్చు చేయాలో అవగాహన కల్పించారు.
అనంతరం ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాస రావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల మౌలిక సదుపాయాలపై దృష్టి సారించి మండలం లో గల అన్ని పంచాయతీలకు సంబంధించి 2025-26 కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకొని అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. అత్యవసర పనులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు విడుదల చేస్తున్న నిధులను సద్వినియోగం చేసి పంచాయతీలలో అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పరవాడ జడ్పిటిసి పి. ఎస్ రాజు గారు,వైస్ ఎంపీపీ బంధం నాగేశ్వరరావు, పరవాడ మండలం సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.