SAKSHITHA NEWS

స‌మ‌గ్ర గ్రామాభివృద్ధికి పంచాయతీ ఛాంపియన్స్ కృషి చేయాలి : ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాత‌య్య)
ఎమ్మెల్యే ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన ” పంచాయతీ ఛాంపియన్స్”

జ‌గ్గ‌య్య‌పేట‌ : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన “వికసిత్ పంచాయత్” భాగంగా ఎన్టీఆర్ జిల్లా జ‌గ్గ‌య్య‌పేట రూర‌ల్ మండ‌లం నుంచి పంచాయతీ ఛాంపియన్స్ గా శిక్షణ పొందిన 8 మంది బుధ‌వారం జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)ను ఆయ‌న నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. లో గ్రామ పంచాయతీలను స‌మ‌గ్రంగా ఏ విధంగా అభివృద్ది చేయాల‌నే అంశం పై ఫిబ్రవరి 10 తేదీ నుండి 16వ తేదీ వరకు శిక్ష‌ణ పొందిన అనేక విషయాల గురించి పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ కు వివరించారు . ఎన్ఐఆర్ డి పిఆర్ లో నిర్వ‌హించే ప్రొగ్రామ్స్ గురించి అడిగి తెలుసుకున్నారు .

ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాత‌య్య‌) మాట్లాడుతూ కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) వికసిత్ పంచాయతీ కార్యక్రమంలో జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం యువ‌కుల్ని భాగస్వాములు చేయటంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. స‌మగ్ర గ్రామాభివృద్ధికి పంచాయతీ ఛాంపియన్స్ క్రియాశీల‌కంగా ప‌ని చేయాల‌న్నారు.

ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ ప్రెన్యూర్ వుండాల‌న్న ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆశ‌య సాధ‌న కోసం ఎన్టీఆర్ జిల్లాలోని స‌మగ్ర గ్రామాల‌భివృద్ది పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ల‌క్ష్యాన్ని పంచాయతీ ఛాంపియన్స్ నెర‌వేర్చాల‌న్నారు. పంచాయతీ ఛాంపియ‌న్స్ కి అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తాన‌ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో పేరం రమేష్, దోరేపల్లి బాల గోపి, బాణావత్ సతీష్ నాయక్, పిల్లి చిట్టిబాబు, కొరివి సైదులు, S K నాగులు, కాకనబోయిన క్రాంతి కుమార్, తీగల రాజేష్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app