SAKSHITHA NEWS

అభివృద్ధి పనులు వేగిరం చేయాలి : అధికారులకు పద్మారావు గౌడ్ ఆదేశాలు


సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. జీ.హెచ్.ఎం.సీ. నూతన ఎగ్జికిటీవ్ ఇంజినీర్ పేర్రాజు నేతృత్వంలోని ఇంజినీరింగ్ అధికారుల బృందం శనివారం సాయంత్రం సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో పద్మారావు గౌడ్ తో సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళికి అన్ని స్మశాన వాటికలలో ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలనీ, రానున్న ఆల్ సోల్స్ డే ను పురస్కరించుకొని క్రిస్టియన్ స్మశాన వాటికలలో సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. లాలాపేట, అడ్డగుట్ట మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మాణం పనులతో వాటు వార్డు కార్యాలయం ఏర్పాటు పనులను పూర్తి చేయాలనీ, రోడ్ల తొవ్వకాలను చేపట్టిన ప్రదేశాల్లో కొత్త రోడ్ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఈ.ఈ. పేర్రాజు తో పాటు డీ ఈ ఈ స్వర్ణ లత, ఇతర అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS