ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగూడ లో సీనియర్ నాయకులు జోగిపేట్ భాస్కర్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం లో బ్రహ్మ శ్రీ వేదమూర్తులైన అరుణ్ గురుస్వామి వారి చేతుల మీదుగా శ్రీ పద్మావతీ అలివేలుమంగా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ద్వజస్తంభ, శిఖర, రాజగోపుర, నరసింహస్వామి యంత్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో గౌరవ తాజా మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ , వారి సతీమణి శ్రీమతి శ్యామల దేవి .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శ్రీ పద్మావతీ అలివేలుమంగా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ద్వజస్తంభ, శిఖర, రాజగోపుర, నరసింహస్వామి యంత్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండుగ గా జరిగినది అని, వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండలని, స్వామి వారి కృపా ప్రజలందరి పై ఉంటుంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

