పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అనేది ఒక ఊరట..
పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలో పేదలకు మెరుగైన వైద్యసేవలు..
ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలి..
పెద్దపల్లి శాసనసభ్యులు. చింతకుంట విజయరమణ రావు …
…
సాక్షిత పెద్దపల్లి// పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్.కే గార్డెన్స్ లో శనివారం పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వివిధ గ్రామాలకు చెందిన 238 మంది సీ.ఎం.ఆర్.ఎఫ్ లబ్దిదారులకు, ₹75,88,000/- లక్షల రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి పంపిణి చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ..పేద ప్రజల వైద్య ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఊరట కలుగుతుందని అన్నారు. పేదలు కడుపునిండా భోజనం చెయ్యాలనే సదుద్దేశంతో స్వర్గీయ ఎన్టీఆర్ 2 రూపాయలకే రేషన్ బియ్యం పంపిణీ పథకం ప్రవేశపెడితే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధనికులతో సమానంగా పేదలు సన్న బియ్యంతో భోజనం చెయ్యాలనే లక్ష్యంతో సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో పెద్దపల్లి నియోజకవర్గానికి దాదాపు 1000 కోట్ల రూపాయల పైచిలుకు అభివృద్ధి పనులు మంజూరు చేయడం మన అదృష్టమని, ప్రజల దీవెనలతో గెలిచిన తాను ప్రతిక్షణం ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తున్నానని, నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి లేకుండా పాలన సాగిస్తున్నారని, అదేవిధంగా జిల్లా కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నూతన భవన నిర్మాణం శరవేగంగా సాగుతోందని అన్నారు.
పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలోనే సేవల విషయంలో మొదటి స్థానంలో ఉందని, ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కంటికి సంబంధించిన వైద్య సేవలు చేయడం జరుగుతుంది. నవజాతి శిశు కేంద్రం ద్వారా పుట్టిన పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. భవిష్యత్తులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్నామని అన్నారు.
అధికారం చేపట్టిన రెండు సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచారని, అడిగినవారికి కాదనకుండా రేషన్ కార్డులను అందించారని, రైతులకు రుణమాఫీతో పాటు సన్న వడ్లకు బోనస్ అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేనిని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలందరికీ సన్నబియ్యాన్ని అందించి అండగా నిలుస్తున్నారని సూచించారు.రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గం కోట్లాది రూపాయలతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని నియోజకవర్గంలో బస్సు డిపోను ఏర్పాటు జరుగుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు నుగ్గిళ్ల మల్లయ్య, బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ చైర్మన్లు, పలు గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

