భక్తిశ్రద్ధలతో,సోదరా భావంతో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను జరుపుకోవాలని కోరిన

Sakshitha news

భక్తిశ్రద్ధలతో,సోదరా భావంతో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను జరుపుకోవాలని కోరిన ……………. రాష్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి
సాక్షిత వనపర్తి
పవిత్ర రంజాన్ మాసం పరస్పర ప్రేమ, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని, ముస్లింలందరూ రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి తెలిపారు.

జిల్లా కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో రంజాన్ మాసం ను పురస్కరించుకొని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథులు గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఇఫ్తార్‌లో పాల్గొని రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపి, పలువురికి రంజాన్ తోఫా అందజేశారు.

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఐక్యత పెంపొందించే పండుగగా రంజాన్ ప్రత్యేక స్థానం కలిగి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందేలా కృషి కొనసాగుతోందని తెలిపారు.

వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ ఉపవాసం ద్వారా ఆత్మ నియంత్రణతో పాటు పేదల పట్ల సానుభూతి పెంపొందుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, సహకారంతో సమాజ అభివృద్ధికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ పండుగ శాంతి, సౌభ్రాతృత్వం మరియు ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు.

కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ముస్లిం మత పెద్దలు ఆఫ్జాలుద్దీన్, రహీం, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top