పేదల ఆర్థిక ప్రగతికి పి-4 దోహదం.

Sakshitha news

పేదల ఆర్థిక ప్రగతికి పి-4 దోహదం.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి,

పేదల ఆర్థికస్థితిని మెరుగు పర్చడమే పి-4 కార్యక్రమ ప్రధాన లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. పి-4 కార్యక్రమంలో భాగంగా మైలవరం జ్యుయలరీ షాప్స్ ఆధ్వర్యంలో మేడసాని కిషోర్ సౌజన్యంతో కొండపల్లిలో 10 కుటుంబాలకు రూ.80 వేల విలువైన సామాగ్రి, నగదును ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ దార్శనికులు సీఎం చంద్రబాబు గారి ఆలోచనలో నుంచి పి-4 ఉద్భవించిందన్నారు. సంపద కలిగిన కుటుంబాలు అట్టడుగున ఉన్న కుటుంబాలకు అండగా నిలబడటమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. పేదల సాధికారత కోసం చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఉన్నత కుటుంబాల వారంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పేద కుటుంబాలను ఆదుకున్న దాతలను అభినందించారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు(గాంధీ), ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.