ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
కొండపల్లిలో మెడికల్ క్యాంపు సందర్శన
ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి,
ఆరోగ్యమే మహాభాగ్యం అని, ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పాత వెంకటేశ్వర థియేటర్ వద్ద ఉన్న అనుమోలు కన్వెన్షన్ హాల్ వద్ద డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని, వైద్యులను వివిధ పరీక్షల గురించి వాకబు చేశారు. శిబిరానికి వచ్చిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. గ్రామ పెద్దలను, స్థానికులను పలకరించారు. ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
