నందిగామలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య ..
నందిగామ, , నందిగామ పట్టణం కాకాని నగర్‌ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మొత్తం 59 మంది లబ్ధిదారులకు రూ.31,83,832 విలువైన ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో మంజూరైంది.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కూటమినేతలతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అవసరంలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి ద్వారా మద్దతు అందించడం ఎంతో సంతృప్తికరమైన విషయం” అని పేర్కొన్నారు.
చెక్కులు అందుకున్న లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు,పార్టీ నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
