పొంగి పొర్లుతున్న ఫతేపూర్ మూసి వాగు
సాక్షిత శంకర్‌పల్లి మండల పరిధిలోని టంగటూరు, ప్రొద్దుటూరు, మునిసిపల్ పరిధిలోని ఫతేపూర్ వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా టంగటూరు, ప్రొద్దుటూరు, ఫతేపూర్ వాగులోకి వరద నీరు భారీగా చేరుతోంది. టంగుటూరు గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలోకి వరదనీరు భారీగా చేరి ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాగుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గ్రామ పంచాయతీ, మునిసిపల్ సిబ్బంది హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కురుస్తున్న వర్షాలకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాగు వద్ద ప్రజలు, యువత సెల్ఫీలు దిగి ముచ్చట పడుతున్నారు.
పొంగి పొర్లుతున్న ఫతేపూర్ మూసి వాగు
Related Posts
తొర్రూరు సిఐ జగదీష్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు
SAKSHITHA NEWS తొర్రూరు సిఐ జగదీష్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు పిడిఎస్ అక్రమ రవాణా దారుడు నుంచి ఐదు లక్షల డబ్బులు డిమాండ్ చేయడంతో రెండు లక్షల తీసుకున్నారని ఆరోపణలపై తీసుకున్న ఏసీబీ అధికారులు SAKSHITHA NEWS
మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
SAKSHITHA NEWS మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే..! ఏపుగా పెరుగుతున్న పైరు పంటలపై ఇతరులు దృష్టి పడకుండా రైతులు వివిధ రకాల ప్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. దేవుళ్లు, సినీనటులు, జంతువులకు సంబంధించిన ఫొటోలను పెడుతుంటారు.…