SAKSHITHA NEWS

ఆపదలో ఉన్నవారిని ఆపద్బాంధవులు మా నాయకులు, బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ : బిఆర్ఎస్ నాయకులు….

గాజుల రామారం డివిజన్ బాలయ్య నగర్ ప్రాంతానికి చెందిన కొరవర నర్సమ్మ భర్త బాసప్ప (36), రంగారెడ్డి నగర్ ప్రాంతానికి చెందిన కేశవ్ పట్ల అరులప్ప తండ్రి జోసెఫ్ (48) లు గత రెండు రోజుల క్రితం వారి ఆరోగ్య పరిస్థితిపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని ఆశ్రయించగా వారి ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితిపై చలించిన బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రత్యేక శ్రద్ధతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కొరవర నర్సమ్మ భర్త బాసప్ప (2,00,000/-), రంగారెడ్డి నగర్ ప్రాంతానికి చెందిన కేశవ్ పట్ల అరులప్ప తండ్రి జోసెఫ్ (2,00,000/-) లకు ఎల్ఓసీ మంజూరు చేయించగా ఈరోజు చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయా డివిజన్ల ప్రజాప్రతినిధులు, నాయకుల చేతుల మీదుగా లబ్ధిదారులకు ఎల్ఓసీ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ…..ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక భద్రతనిచ్చేది, ఆరోగ్య భరోసానిచ్చేది సీఎం సహాయనిధి అని, నిరుపేదల ఆరోగ్య బాగోగులకై చలించే మా నాయకులు, బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ పేదల అరోగ్యపరిస్థితిపై ఎప్పుడూ ముందుంటారని అన్నారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ విజయ్ శేఖర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు ఏర్వ శంకరయ్య, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, గాజుల రామారం డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, బాలయ్య నగర్ కాలనీ వెల్ఫేర్ అధ్యక్షులు నగేష్, సీనియర్ నాయకులు ఓంకార్ రెడ్డి, సుధాకర్, అఖిల్, రాజు, కె.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.