SAKSHITHA NEWS

రేవంత్ చీటింగ్ పై మా ఫైటింగ్ ఆగదు : కేటీఆర్

రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కుచ్చుటోపి పెట్టిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ ది ఒకమాట అయితే మంత్రులది మరోమాట ఉందన్నారు. రుణమాఫీ విషయంలో మంత్రులకే సమన్వయం లేదని విమర్శించారు. రుణమాఫీ చేసింది పావులంతా అయితే పూర్తిగా మోసం ఉందన్నారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడారు.

ఆంక్షలు,కొర్రీలు పెట్టకుండా రుణమాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎప్పటివరకు రుణమాఫీ చేస్తుందో కూడా ప్రభుత్వం చెప్పాలన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోని కోడంగల్ లోని కోస్గి మండలంలో 22 వేల మంది రుణం తీసుకుంటే కేవలం 8 వేల మందికి మాత్రమే రుణమాఫీ అయిందన్నారు. రుణమాఫీ కోసం ఆందోళనలు చేస్తున్న రైతులపై ఎందుకు కేసులు నమోదు చేస్తున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు. సీఎం, మంత్రివర్గం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేపు అన్ని మండలకేంద్రాల్లో ధర్నా చేపడతామని చెప్పుకొచ్చారు. రైతుల తరుపున పోరాడేందుకు ఎప్పుడు బీఆర్ఎస్ ముందుంటుందని వెల్లడించారు. రేవంత్ చీటింగ్ పైన మా ఫైటింగ్ ఆగదని హెచ్చరించారు.

WhatsApp Image 2024 08 21 at 13.43.21

SAKSHITHA NEWS