ఒకే సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునే అవకాశం..
సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా : ఓపెన్ టెన్త్ ఇంటర్ ప్రవేశాలు తెలంగాణ ఓపెన్ సొసైటీ 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి అడిషనల్ గడువు ఈ నెల 11 వరకు పొడిగిస్తున్నట్లు శ్రీ బాలాజీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ బానోత్ బాలాజీ తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దూరవిద్యతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కు దగ్గర కావాలని అన్నారు 2024- 2025 విద్యా సంవత్సరానికి గాను ఓపెన్ టెన్త్ ఇంటర్ ప్రవేశాల కోసం అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు 14 సంవత్సరాలు నిండిన వారు చదవడం రాయడం వస్తే పదవ తరగతి పరీక్ష రాసుకునే అవకాశం ఉందని ఇంటర్ ఒకే సంవత్సరంలో పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. పలు కారణాలతో చదువు మధ్యలో నిలిపివేసిన వారు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఓపెన్ కోర్సుల ద్వారా అర్హతలు పెంచుకోవచ్చని వారు సూచించారు. పూర్తి వివరాల కొరకు శ్రీ బాలాజీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెల్ నెంబర్ 9912559988 మరియు 9948 401228 ను సంప్రదించాలని వారు కోరారు