SAKSHITHA NEWS

ఘటకేసర్ రైల్వే బ్రిడ్జ్ పనులపై ప్రజలను తప్పు దోవా పట్టించేందుకు ప్రతిపక్షాల కుట్రలు

•త్వరలోనే బ్రిడ్జ్ పనులను పూర్తి చేస్తాం-
రిలీ దీక్షలను విరమింప చేసిన తోటకూర వజ్రెష్ యాదవ్

పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏనాడూ బ్రిడ్జ్ సమస్యపై నోరుమెదపని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు నేడు కావాలనే బ్రిడ్జ్ సమస్యపై రాద్దాంతం చేస్తున్నారని టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిలు అన్నారు.శుకవారం నాడు రైల్వే బ్రిడ్జ్ పనులను మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పావని యాదవ్ లతో కలిసి దీక్ష శిబిరాన్ని సందర్శించి దీక్షలో కూర్చున్న వారికి నిమ్మ రసం ఇచ్చి దీక్షలు విరమింపచేశారు. అనంతరం మాట్లాడుతూ నాడు ఎంపీగా,మంత్రిగా పది సంవత్సరాల పాటు అధికారం వెలగ బెట్టిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఏ ఒక్క రోజు కూడా రైల్వే బ్రిడ్జ్ పనులపై చిత్త శుద్ధితో ఒని చేయాలేదని రాష్ట్రంలో అధికారం పోగానే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశంపై ముఖ్యమంత్రి ,రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు ప్రారంభం అయ్యేలా చూశారని అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో పనులు ఎందుకు కాలేదో సమాధానం చెప్పే దమ్ము లేని మల్లారెడ్డి నేడు చౌకబారు విమర్శలు చేస్తే ప్రజలు ఉరుకోరని అన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు ఈ సమస్యపై ఎందుకు దృష్టి సారించలేదో ప్రజలకు సమాధానం చెప్పాకే దీక్షలకు సంఘీభావం చెప్పాలని మల్కాజిగిరి ఎంపీ ఈటేల రాజేందర్ ను డిమాండ్ చేశారు.ఎది ఎమైన ఏప్రిల్ వరకు బ్రిడ్జ్ పనులు పూర్తయ్యేలా కృషి చేస్తామని హమీ ఇచ్చారు.


SAKSHITHA NEWS