వంద శాతం ఫలితాలు
పదవ తరగతి విద్యార్థులు వంద శాతంఫలితాలు సాధించాలని ..,………… ఉమ్మడి జిల్లా పరీక్షల విభాగం సెక్రెటరీ కోరారు
సాక్షిత వనపర్తి
పదవ తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించేలా విద్యార్థులు ప్రయత్నం చేయాలని జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం సెక్రటరీ సూర చంద్ర శేఖర్ అన్నారు.
స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ ల పర్యవేక్షణలో భాగంగా యాపర్ల జెడ్పీ హై స్కూల్ ను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా చంద్ర శేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో పదవ తరగతి కీలకమైన ఘట్టమని,అందులో ఉత్తీర్ణత చాలా ప్రభావితం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కొద్ద్ది సమయంలో విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలని ఆయన ప్రోత్సహించారు.స్వచ్చందంగా పాఠశాలలో విద్యా బోధన చేస్తున్న మైనోద్ధీన్,అనూష,సంధ్య,శివాని,గ్రామ విద్యాభిమాని స్వరాజ్యం బాబురెడ్డిని సూర చంద్ర శేఖర్ శాలువాలతో ఘనంగా సన్మానించారు.పదవ తరగతి విద్యార్థులకు స్టడి మెటీరియల్ అందజేశారు.
ఈనాటి కార్యక్రమంలో ఎ ఎం ఒ మహానంది పాఠశాల ప్రధానోపాధ్యాయులు పలుస శంకర్ గౌడ్,ఉపాద్యాయులు వెంకటేష్,ఈశ్వర్ రెడ్డి,ఆంజనేయులు,బాలమ్మ, కవి,వ్యాఖ్యాత బైరోజు చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వంద శాతం ఫలితాలు
Related Posts
మాదాపూర్ లోని రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం
SAKSHITHA NEWS మాదాపూర్ లోని రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం హైదరాబాద్: హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డీ మార్ట్ ఎదురుగా ఉన్న కృష్ణ కిచెన్ రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా…
సంక్రాంతికి తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్?
SAKSHITHA NEWS సంక్రాంతికి తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్? హైదరాబాద్: తెలంగాణలో సంక్రాంతి పండుగకు ముందే మందుబాబులకు చేదు వార్త ప్రకటించనుంది, బేవరేజస్ కార్పొరేషన్ కు బీర్లు సరఫరా నిలిపి వేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ప్రకటించింది. దీంతో ఆ…