అక్రమ మద్యం స్వాధీనం: ఒకరి అరెస్ట్

Sakshitha news

అక్రమ మద్యం స్వాధీనం: ఒకరి అరెస్ట్

చిలకలూరిపేట రూరల్:బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం గన్నవరం గ్రామానికి చెందిన యలమంచి మురళి అనే వ్యక్తి అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుమర్రు వాగు వద్ద నిందితుడు 180 మి.లీ. పరిమాణం గల 40 మద్యం సీసాలను కలిగి ఉండగా, పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

చిలకలూరిపేట రూరల్ .ఎస్.ఐ కె. లేఖ ప్రియాంక తన సిబ్బందితో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు. నిందితుడి వద్ద నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Scroll to Top