కొల్హాపూర్ అమ్మవారికి టీటీడీ పట్టువస్త్రాలు
** సమర్పించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు
సాక్షిత ప్రతినిధి – కొల్హాపూర్ / తిరుమల: నవరాత్రి ఉత్సవాల సందర్బంగా కొల్హాపూర్ శ్రీ మహాలక్షి అమ్మవారికి టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ (బీఆర్) నాయుడు దంపతులు టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. కొల్హాపూర్ ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ దంపతులు పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించి దర్శనం చేసుకున్నారు. అర్చకులు ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు ప్రశాంతి, శాంతా రామ్, జీ.భానుప్రకాష్ రెడ్డి, సౌరబ్ హెచ్ బొర, టిటిడి ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
