స్విమ్స్ కార్డియాలజీలో సిపిఆర్ పై అవగాహన
….
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘ప్రపంచ హృదయ దినోత్సవం’ లో భాగంగా పద్మావతి ఓ.పి.డి.బ్లాక్ వెయిటింగ్ హాల్ లో సిపిఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్విమ్స్ కార్డియాలజి అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. హరీష్ చౌదరి, మెడిసిన్ రెసిడెంట్ వైద్యులు డా. సాయికుమార్ మాట్లాడుతూ… స్విమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డా. రాజశేఖర్ ఆదేశాల మేరకు సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. సిపిఆర్ అనగా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించే ప్రక్రియ అని, ఎవరికైన శ్వాస లేదా హృదయ స్పందన ఆగిపోయినప్పుడు గుండె కొట్టుకోకపోవడం, అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు గుండె, మెదడుకు రక్త ప్రసరణ పునరుద్దరించడానికి చేసే చికిత్స అని తెలిపారు. గుండె ఆగిపోయిన తరువాత సిపిఆర్ చేయడం వలన ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో దాదాపు 100 మంది పైగా పాల్గొని సిపిఆర్ పై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్డియాలజీ విభాగపు వైద్యులు,
స్విమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ వెంకటకోటిరెడ్డి, ఎంఆర్ఓలు శిరీష, వివేక్, తిరుపతి సన్ ఫార్మా కంపెనీ మెడికల్ రెప్స్ రామాంజనేయులు, శరణ్ కుమార్, పేషంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
