SAKSHITHA NEWS

| కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల సంబరాలలో భాగంగా 129 డివిజన్ సూరారంలో కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ప్రజాపాలన సంబరాలలో భాగంగా 129 డివిజన్ సూరారం గ్రామ పరిధిలో కృష్ణ నగర్ లో నిర్వహించిన జెండా ఆవిష్కరణలో ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఆవిష్కరించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి . అనంతరం హన్మంతన్న పరిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ శాల్వాతో సత్కారించి ఎనుముల రేవంత్ రెడ్డి హయాంలో అందిస్తున్న గృహజ్యోతి పథకం, 500 రూ గ్యాస్ సిలిండర్ వంటివి పేదప్రజలకు అండగా నిలుస్తుంది రేవంత్ సర్కార్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజి – కార్పొరేటర్ పాలకృష్ణ, డివిజన్ అధ్యక్షులు సంతోష్ ముదిరాజ్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, వెంకటేష్, రజాక్, శ్రీశైలం యాదవ్, కృష్ణారెడ్డి, శివ నాయక్, అబ్బు, సజ్జు, బబ్లు, జగన్, శివ, గురు, షఫీ మరియు మహిళ నాయకురాలు అన్నపూర్ణ, అంజలి, మౌనిక, పవని, ఈశ్వరి, అచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS