టీడీపీ కరీముల్లా ను మర్యాద పూర్వకంగా కలసిన : ఓల్డ్ బ్యారెన్ వ్యాపారులు..
ఎమ్మెల్యే ప్రత్తిపాటి దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లాలని విన్నపం..
చిలకలూరిపేట : స్థానిక ప్రత్తిపాటి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ ఛైర్మెన్ షేక్ టీడీపీ కరీముల్లా ను ఓల్డ్ బ్యారెన్ నగర్ వ్యాపారస్థులు మర్యాద పూర్వకంగా కలసి మాజీమంత్రి స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా నియమితులైన షేక్ టీడీపీ కరీముల్లా ను
ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము ఓల్డ్ బ్యారెన్ నగర్ లో గడిచిన 20 ఏళ్లుగా వ్యాపారం
చేసుకుంటున్నామని వారి సమస్యలు విన్నవించుకొని మాజీమంత్రి స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలను సానుకూలంగా పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలని వారు కోరారు. దీనిపై మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరీముల్లా మాట్లాడుతూ బ్యారెన్ నగర్
ఆవిర్భావం కావచ్చు ,బ్యారెన్ నగర్ వ్యాపారస్థులకు వ్యాపారం చేసుకునేందుకు తక్కువ వడ్డీతో బ్యాంక్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయంచిన , బ్యారెన్ నగర్ లో మౌలిక సదుపాయాలు కల్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయంలోనే జరిగిందన్నది మాతో పాటుగా పుర ప్రజలకు పుర ప్రముఖుల అందరికీ విదితమేనని.మరి ముఖ్యంగా మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు రెండున్నర ఏళ్లుగా బ్యారెన్ నగర్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారో.అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కూడా పెద్ద మనస్సుతో ఏ విధంగా అందుకున్నారో మీతో పాటుగా పుర ప్రజలకు తెలుసు. తప్పకుండా మీ సమస్యను మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి దృష్టికి తీసుకువెళ్తామని హరి భరోసా ఇచ్చారు.చైర్మెన్ నీ కలసిన వారిలో లెజెండ్ సుభాని, జే కృపారావు, అబ్దుల్ కలాం,పోతవరం సుభాని.షేక్ షమర్, నూరుద్దీన్. అబ్దుల్ ఉస్మాన్.ఎస్ కిషోర్.బి.దాసు.తదితరులు ఉన్నారు
