జ్యోతిరావు పూలే, అంబేద్కర్ మరియు కమ్యూనిటీ హాల్

Sakshitha news

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం, సత్తెనపల్లి మండలం లక్క రాజు గార్లపాడు గ్రామం లో ఇంచుమించు రెండు నెలల నుండి గ్రామ కంటకానికి సంబంధించిన సర్వేనెంబర్ 114, 115 లలో భూమి ఉన్నందున గార్లపాడు మాదిగపల్లికి సంబంధించిన ఎమ్మార్పీఎస్ కమిటీ అదే స్థలంలో జ్యోతిరావు పూలే, అంబేద్కర్ గార్ల మరియు కమ్యూనిటీ హాల్ కి పర్మిషన్ అడగగా సత్తెనపల్లి మండలం ఎమ్మార్వో గారు అది కోర్టు పరిధిలో ఉన్నది అక్కడ కమ్యూనిటీ హాలు విగ్రహాలు ఏర్పాటు చేయడం కుదరదు నివేదిక ఇవ్వడం జరిగింది. మాన్య శ్రీ మంద కృష్ణ మాదిగ గారి నాయకత్వం లో ఈ విషయం పై అద్దంకి బాబు మాదిగ మాట్లాడుతూ అదే స్థలంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఉంది, అదనంగా కొన్ని నిర్మాణాలు ఏ విధంగా జరిగాయి ఇక్కడ ఉన్న బావి ఎందుకు పూడ్చారు, మహనీయుల విగ్రహాలు మరియు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసేందుకు మాత్రం పర్మిషన్ నిరాకరించడం దారుణం అంటూ సత్తెనపల్లి డివిజన్ ఆర్డీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ విషయాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది కులం రంగు పార్టీ రంగు అంటూ మాదిగ పల్లెలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని భవిష్యత్తులో ఎలాంటి కార్యచరణకైనా సిద్ధమని చెప్పి దానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొడవటి అశోక్ మాదిగ పల్నాడు జిల్లా ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి, పోలే పోగు రాములు మాదిగ పల్నాడు జిల్లా msp అధికార ప్రతినిధి, కందుకూరి రమేష్ మాదిగ పల్నాడు జిల్లా ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు, గడ్డి పర్తి శ్రీను మాదిగ ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు, మాతంగి సత్య ఆనందం మాదిగ ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి, కొండపోగు క్రాంతి మాదిగ చిలకలూరిపేట నియోజకవర్గ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు, సత్తెనపల్లి మండలం ఇన్చార్జి, కందుల అంబేద్కర్ మాదిగ ముప్పాళ్ళ మండలం ఇంచార్జ్, మరియు లక్కరాజు గార్లపాడు ఎమ్మార్పీఎస్ కమిటీ గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.