అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
ప్రజావాని సందర్బంగా కుత్బుల్లాపూర్ సర్కిల్ మునిసిపల్ కార్యాలయం ఎదురుగా సిపిఐ ఆధ్వర్యంలో గత ప్రజవానిలో ఇచ్చిన సమస్యను పరిష్కరించలేదని ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గిరినగర్ 127 డివిజన్లో రోడ్డు పైకి అలాగే ఇతరుల స్థలంలోకి షెడ్ లు వేశారని,వాటిని వెంటనే తొలగించాలని వారం క్రితం పిర్యాదు చేసినప్పటికి నేటికీ అధికారులు నేడు,రేపు అంటూ తాత్సరం చెయ్యడం సిగ్గుచేటని,నిర్లక్ష్యం వీడి వెంటనే తొలగించాలని లేనిపక్షంలో కదిలేది లేదని హెచ్చరించారు.
డిప్యూటీ కమిషనర్ నర్సింహులు స్పందించి తీసివేస్తామని చెప్పడం జరిగింది.
ఒకవేళ తీసివేయ్యకపోతే తిరిగి ధర్నా నిర్వహిస్తామని చెప్పి ధర్నాను విరమించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యథితిగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏసురత్నం,నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ హాజరుకాగా,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి,హరినాథ్,మండల కార్యవర్గ సభ్యులు సదానంద్,కృష్ణ, శ్రీనివాస్,సహాదేవ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ నర్సయ్య,మండల పార్ట్ నాయకులు బాబు, ఇమామ్, యకుబ్ , చారీ,నాగప్ప, సుంకిరెడ్డి, శ్రీనివాస్,ముసలయ్య,రవి,రాములు,యాదయ్య,బాలరాజ్, నర్సిరెడ్డి,బుచ్చిరెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సిపిఎం మండల కార్యదర్శి లక్ష్మణ్,అంజయ్య లు మద్దతు తెలపడం జరిగింది.