SAKSHITHA NEWS

ఫాల్గుణ మాసం శుక్ల పక్షమి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర ప్రజలు ‘పకాలు బువ్వ’ దినోత్సవం నిర్వహించు కున్నారు. పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథునికి మజ్జిగన్నం (పకాలు బువ్వ), తోటకూర వేపుడు, అరటికాయ వేపుడు, కూరగాయల ఇగురు, పులుసు తదితర వంటకాలు ఆనవాయితీ ప్రకారం అర్పణయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా తరవాణి అన్నం దినోత్సవం

జగన్నాథునికి పకాలు బువ్వ అర్పణ

పకాలు బువ్వ తిన్న సీఎం నవీన్‌ పట్నాయక్

గోపాల్‌పూర్‌:

ఫాల్గుణ మాసం శుక్లపక్షమి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర ప్రజలు ‘పకాలు బువ్వ’ దినోత్సవం నిర్వహించుకున్నారు. పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథునికి మజ్జిగన్నం, తోటకూర వేపుడు, అరటికాయ వేపుడు, కూరగాయల ఇగురు, పులుసు తదితర వంటకాలు ఆనవాయితీ ప్రకారం అర్పణయ్యాయి. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు స్వామికి నైవేద్యమైన ప్రసాదాలు తృప్తిగా ఆరగించారు. మరోవైపు పకాలు బువ్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నరు రఘుబర్‌ దాస్‌, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తదితర నాయకులు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా ప్రజల్ని అభినందించారు.
ఆరోగ్యానికి మేలు చేస్తుంది

మండు వేసవిలో మజ్జిగన్నం, తరవాణి (పకాలు) కలిపిన అన్నం, కూరగాయలు ఆరగిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆయుర్వేద శాస్త్ర రీత్యా వేసవిలో మజ్జిగ లేదా పకాలు బువ్వ శరీరానికి చల్లదనం ఇస్తాయి. వేసవి ఎండలు తగ్గే వరకు నిత్యం దీన్ని తీసుకోవడం మేలు.

పూరీ శ్రీక్షేత్రంలో స్వామికి దీన్ని ఎండలు తగ్గే వరకు వీటిని అర్పిస్తారు. ప్రజలందరికీ దీనిపై చైతన్యపరుస్తూ పకాలు దినోత్సవం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నవీన్‌ నివాస్‌లో సీఎం దీనిని ఆరగించారు. దిల్లీలో రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివన్ష్‌, ఇతర ప్రముఖులతో కలిసి కేంద్ర మంత్రి ధర్మేంద్ర కలసి భోజనం చేశారు.

WhatsApp Image 2024 03 21 at 10.03.02 AM

SAKSHITHA NEWS