విప్లవోద్యమం అంత త్యాగాల అడుగుజాడలే:మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నుపా భాస్కర్

Sakshitha news

విప్లవోద్యమం అంత త్యాగాల అడుగుజాడలే:మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నుపా భాస్కర్

సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని ఏనుగప్పయ్య నగర్ గ్రామంలో జరిగిన అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొని కమ్యూనిస్టు ఉద్యమం విప్లవోద్యమం అంతా త్యాగాలా ఆడుగుజాడలే వెలవేల మంది రక్త తర్పణలతో ఎర్రజెండాను ఎరుపెక్కించారు అని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నుపా భాస్కర్ అన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సంయుక్త మండల కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ పార్టీ మండల కార్యదర్శి కోర్సా రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సభలో మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నుపా భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రత్యేకించి 58 ఏళ్ల భారత కమ్యూనిస్టు విప్లవ ఉద్యమాలలో ప్రజల కోసం, ఈ దేశంలో ప్రజాతంత్ర, సోషలిస్ట్ విప్లవం కోసం పోరాడి ఎందరో ప్రాణాలర్పించారు.భారతదేశంలో వర్గ పీడన,దోపిడీ,కుల వ్యవస్థ మతాలు, మూఢ నమ్మకాలు సాంఘిక, రాజకీయ అసమానతలు, ఆర్థిక అంతరాలు పోవాలని, మనిషిని మనిషి పీడించే సమాజం అంతరించి నిండైన, మైండైన ప్రజాస్వామిక సమాజం రావాలని,సోషలిస్ట్ సమాజం స్థాపించాలనే ఆశయాన్ని వారు ఎంచుకున్నారు. ఆ ఆశయం వెలుగులో వారు యావత్ జీవితాన్ని సమాజ మార్పు కోసం వెచ్చించారు.ప్రజలను కూడగట్టి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించారు. పార్టీ అరుణ పతాకాన్ని సమర పతకంగా నిలబెట్టారు. ప్రజలను ఉద్యమశీరులుగా తీర్చిదిద్ది,ఎందరో కార్యకర్తలను ఉద్యమ కారులుగా, రాజకీయ వేత్తలుగా తీర్చిదిద్దింది ముందుకు నడిపించారు. నిర్బంధాలను,కుట్ర కేసులను,ప్రభుత్వ,పోలీసు,భూస్వామ్య,పెట్టుబడిదారీ వర్గాలను దాడులను ఎదుర్కొని ఉద్యమాన్ని నిలబెట్టారు.రైతు,కూలీ,కార్మిక,విద్యార్థి,మహిళా,యువజ,మేదో రంగాలలో కృషిచేసి ఎందరినో రాజకీయ సిద్ధాంత శీరులుగా తీర్చిదిద్దారు. వారందరికీ వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పిద్దాము వారి ఉన్నత ఆశయాలను ముందుకు తీసుకుపోదామని శపధం చేద్దాం, రాజకీయ, సిద్ధాంత కృషిని,ఆచరణ శీలతను మరింత మెరుగ్గా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేసుకొనీ విప్లవ కృషిని,వారి త్యాగరీతిని ఉన్నతంగా కొనసాగిస్తామని అన్నారు. ప్రాణం ఎంతో విలువైనది. జీవితం అత్యున్నతమైనది. తమ ప్రాణం జీవితం కంటే ఎందరో కమ్యూనిస్టు విప్లకారులు సోషలిస్టు ఆశయాన్ని మహోన్నతంగా భావించారు.వీరోచిత తెలంగాణ సాయుధ పోరాటం నగ్జల్బరి,దాని కొనసాగింపుగా సాగిన శ్రీకాకుళం,గోదావరి లోయ పోరాటాలలో ఎంతో మంది ఉన్నతమైన త్యాగలు చేసి,ప్రజలకు భూమిహక్కులు సాధించి పెట్టారు. ప్రజలలో సామాజిక విప్లవ చైతన్యం రగిలించారు.సమరశీలతను సమాజానికి అందించారని మాట్లాడారు. ఈ కార్యక్రమం లో మండల కమిటీ సభ్యులు వెలకం చలమన్న,కారం వెంకటేష్,శాస్త్రబోయిన వెంకటేశ్వర్లు,పిఓడబ్ల్యు జిల్లా నాయకురాలు నుపా సరోజిని నాయకులు ఊకే అజయ్,ఓకే నారాయణ,మడకం కోశయ్య, మడివి విజయ్,మడకం దేవా పాల్గొన్నారు.