అశ్వారావుపేట పట్టణ కేంద్రంలో రెండేళ్ల నుంచి అసంపూర్తిగా రోడ్డు పనులు
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట పట్టణ కేంద్రంలో ప్రధాన రహదారి పనులు రెండేళ్లుగా సాగుతున్న పూర్తి కాకపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము, రాళ్లతో వాహన చోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతుండగా, షాపుల అద్దాలు దెబ్బతింటున్నాయి. వర్షాకాలంలో బురద, మిగతా రోజుల్లో దుమ్ముతో ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి పరిస్థితిని పర్యవేక్షించి రోడ్డు పనులు యుద్ధ ప్రాతిపధికనా పూర్తి చేయాలని అశ్వారావుపేట పట్టణ ప్రజలు కోరుతున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY