సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, తోడేరు గ్రామ సచివాలయ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా తోడేరు వీవర్స్ కాలనీ, శ్రీనివాస్ నగర్ లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా కాకాణి గోవర్ధన్ రెడ్డి .
ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు, గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులను సమీక్షించేందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్నాం.
మా కుటుంబంతో సత్ససంబంధాలు కలిగిన చేనేత కుటుంబాలు ఇళ్ల స్థలాల కోసం కోరగా, మా తండ్రి గారైన మాజీ సమితి అధ్యక్షులు కీ౹౹శే౹౹ శ్రీ కాకాణి రమణా రెడ్డి , ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో కాలనీ ఏర్పడింది.
జిల్లా పరిషత్ చైర్మన్ గా వీవర్స్ కాలనీ లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాము.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతన్నలను ఆదుకునేందుకు “నేతన్న నేస్తం” లాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, సమగ్రంగా, సంపూర్ణంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ కార్యక్రమాలు అందించేలా బ్రహ్మాండమైన పాలనను కొనసాగిస్తున్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామాలలో పర్యటిస్తే తండోప తండాలుగా అర్జీలు, ఫిర్యాదులు వచ్చేవి.
ప్రజలు సమస్యలు పరిష్కారం కాక ఏకరువు పెట్టేవారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తమకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత తెలుగుదేశం ప్రభుత్వం మాదిరిగా జన్మభూమి కమిటీలు, జన్మభూమి కమిటీ సభ్యులు, తెలుగుదేశం నాయకుల జోక్యం లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామాలలో జరిగిన అభివృద్ధిని చూస్తే, ఆత్మసంతృప్తి కలుగుతుంది.
తమ కుటుంబసభ్యుల్లో ఒకరిగా నిరంతరం ఆదరిస్తున్న తోడేరు గ్రామస్తులకు రెండు చేతులు జోడించి, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.