SAKSHITHA NEWS

నూకల నరేష్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు

నూకల నరేష్ రెడ్డి గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి

  • మాజీ ఎంపీ నామ

నూకల నరేష్ రెడ్డి కి ఘన నివాళులు అర్పించిన మాజీ ఎంపీ నామ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, సాక్షిత:

మరిపెడ మండలం పురుషోత్తమయ గూడెం గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు నూకల నరేష్ రెడ్డి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. దశ దిన కర్మ సందర్భంగా గ్రామం లో జరిగిన సంస్మరణ సభలో బి.ఆర్.ఎస్ మాజీ లోక్ సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నామ మాట్లాడుతూ తన తండ్రి నామ ముత్తయ్య నుండి నూకల రామచంద్రారెడ్డి కుటుంబంతో ఏర్పడిన అనుబంధం, తర్వాత రామ్ సహాయం సురేందర్ రెడ్డి మరియు నూకల నరేష్ రెడ్డి కుటుంబాలతో కొనసాగిందని చెప్పారు.

రాజకీయాల్లో వచ్చిన తర్వాత తెలుగు దేశం పార్టీ లో ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన నూకల నరేష్ రెడ్డి, ఆ పార్టీల్లో అభివృద్ది కోసం క్రియాశీలకంగా పని చేశారని వివరించారు. నరేష్ రెడ్డి మరణానికి పది రోజుల ముందు, ఆయన హైదరాబాద్‌లో నామ ఇంటికి వచ్చి దాదాపు రెండు గంటల పాటు పలు విషయాలపై చర్చించిన విషయాని ఈ సందర్భంగా నామ గుర్తుచేసుకున్నారు. నరేష్ రెడ్డి వ్యక్తిత్వం గొప్పదని, దేవుడు మంచి వాళ్లను ముందుగా తీసుకెళ్తాడని అనే సామెత చందంగా నూకల నరేష్ రెడ్డి ని మన నుండి దూరం అవడం చాలా బాధాకరమన్నారు, ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదని నామ ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి తుమ్మల చెప్పినట్లు, నరేష్ రెడ్డి పదవి లేకపోయినా ప్రజల అభిమానాన్ని పొందారని, ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే తపించేవారని పేర్కొన్నారు. పార్టీలో ఉండగా ఆయనకు పదవి ఇవ్వడానికి తాము చేసిన ప్రయత్నాలను గుర్తుచేసుకున్నారు. నరేష్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నామ భగవంతుడ్ని ప్రార్థించారు. నామ వెంట మొండితోక జయకర్, రావూరి శ్రీనివాసరావు, బాణాల వెంకటేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, వాసిరెడ్డి నాగేశ్వరరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, కర్నాటి శ్రీను, కొటారి రాఘవరావు, అబ్బూరి రామన్, నామ సేవా సమితి సభ్యులు పాల్వంచ రాజేష్, తాళ్లూరి హరీష్ బాబు, కృష్ణప్రసాద్ తదితరులు ఉన్నారు


SAKSHITHA NEWS