Non-violence is the invention of universal human welfare
అహింసా విశ్వ మానవ కళ్యాణం ఆవిష్కరణ.. ఈటెల ప్రజాసేవలు ఆదర్శప్రాయం.. మానవుల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు ఆధ్యాత్మిక గురువు డాక్టర్ నాగుల సత్యం గౌడ్…
ఇటీవల గెలిచిన మల్కాజ్గిరి బిజెపి పార్లమెంటు సభ్యులు రాజేందర్ గారు సేవాభావమే జీవిత లక్ష్యంగా ఎంచుకొని, తన వద్దకు ఎవరు వచ్చిన సాధ్యమైనంత వరకు సహకరిస్తూ, తన జీవితాన్నే ప్రజాసేవకు అంకితం చేసిన మహానుభావుడని, ఈటల నిస్వార్థ సేవలు ఆదర్శప్రాయం అని ప్రజాకవి రచయిత మానవ విలువ పరిరక్షణ జాతీయ దక్షులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, తత్వవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్య0 గౌడ్ తన నిస్వార్థ సేవలను కొనియాడారు. అనంతరం సన్మార్గం అమ్మ లాంటిది, అనే సంకల్పంతో సత్యం గౌడ్ రూపొందించిన.. అహింసా విశ్వ మానవ కళ్యాణం.. అనే కవిత సంకలనాన్ని ఈటీవల గెలిచిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ హైదరాబాద్ సామీర్పేటలోని తన నివాసంలోని మీటింగ్ హాల్లోని ఆవరణలో ఆవిష్కరించారు… దీనికన్నా ముందు ఇటీవల మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులుగా ఘనవిజయాన్ని సాధించినందుకు గాను సత్యంగౌడ్, ఈటలను మర్యాదపూర్వకంగా కలిసి బొకేను అందజేసి, పట్టు కిరీటాన్ని ధరింపజేసి, పట్టుశాలవ కప్పి అహింసా విశ్వమానవ కల్యాణం అనే కవిత జ్ఞాపకను అందజేసి ఘనంగా సత్కరించారు.. అనంతరం ఈటెల మాట్లాడుతూ.. సత్యంగౌడ్ రచనలు వారి సామాజిక సేవలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నరు.
ప్రతి ఒక్కరు సేవా భవాని ఆలవరుచుకొని, సమాజ సేవలో భాగస్వాములై, మనం ఏర్పరచుకున్న విలువలను కాపాడుకుంటూ, విలువైన పౌరులుగా ఎదగాలన్నారు. మంచి మానవత్వాన్ని పెంపొందించుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాధి లాంటి స్వార్థంను వదులుకొని నవభారత నిర్మాణానికి పునాదిగా నిలవాలి అన్నారు. విద్యార్థులు యువత చెడు వేసినాలకు, ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి, తల్లిదండ్రులు గురువులు కన్న కలలు నెరవేర్చే దిశగా ముందుకు సాగుతూ ప్రయోజకులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో బత్తిని సంపత్ గౌడ్ మంచిర్యాల రవి నాయకులు విద్యావేత్తలు కవులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.