తర్వాత ఎలాంటి బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వరు
అనధికారలేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకోండి
కమిషనర్ పి శ్రీహరి బాబు
సాక్షిత : చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు మీడియాతో మాట్లాడుతూ అనధికారలేఅవుట్లనుక్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. దీనిని లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) అంటారని, దీనికి సంబంధించిన జీవో ఎంఎస్ నెంబర్ 134, తేదీ 26/07/2025న జారీ అయిందని ఆయన వివరించారు.
పథకం యొక్క ముఖ్యాంశాలు
- 26/07/2025 లోపల వేసిన లేఅవుట్‌లలో, కనీసం ఒక్క రిజిస్ట్రేషన్ అయినా జరిగి ఉంటే, వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
- సాధారణంగా ఓపెన్ స్పేస్ లేకపోతే 14% అపరాధ రుసుము కట్టాల్సి ఉంటుంది. ఈ పథకం కింద 7% అపరాధ రుసుము కడితే సరిపోతుంది.
- లాండ్ కన్వర్షన్ చార్జీలు, ఇతర డాక్యుమెంట్లు ఉన్నవారు ఆన్‌లైన్‌లో లేదా ఎల్‌టిపి (LTP) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఈ పథకానికి మూడు నెలల సమయం ఇచ్చారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
- 45 రోజుల లోపు పూర్తి రుసుము చెల్లిస్తే 10% రాయితీ, 46 నుంచి 90 రోజుల లోపు చెల్లిస్తే 5% రాయితీ ఇస్తారు.

