హై కోర్టు ఉత్తర్వులు లెక్కచేయకుండా అక్రమ మైనింగ్ దందా

Sakshitha news

హై కోర్టు ఉత్తర్వులు లెక్కచేయకుండా అక్రమ మైనింగ్ దందా– పట్టించుకోని మైనింగ్ రెవెన్యూ అధికారులు

మురికిపూడి గ్రామంలో గ్రామ రెవిన్యూ అధికారి అండదండలతో— కొనసాగుతున్నమట్టి తవ్వకాలు

హైకోర్టును సైతం లెక్క చేయమంటున్న అక్రమార్కులు

మరల హైకోర్టులో పిటిషన్ వేయనున్న రైతులు

…..
సాక్షిత*పల్నాడు జిల్లా,చిలకలూరిపేట: * గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయమే ప్రస్తుత పాలనలో కూడా గ్రామస్థాయి నాయకులు కొనసాగిస్తున్నారు ఏ ప్రభుత్వం మారినా ఏ స్థితి మారినా ఆగని దోపిడీ, పేదోడిని దోచుకునే వాడే నాయకుడు అక్రమంగా అడ్డంగా సంపాదించే వాడే నాయకుడు గత ప్రభుత్వం చేసిన తప్పునే ప్రస్తుత పాలకులు గ్రామస్థాయి నాయకులు ప్రవర్తిస్తున్నారు గతప్రభుత్వం సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేసిన ప్రభుత్వం విఫలం అవ్వడానికి గల కారణాలు ఇవే! ఇష్టారాజ్యంగా వ్యవహరించిన నాయకులు కబ్జాలు దందాలు సెటిల్మెంట్లు ఎస్సీ ఎస్టీలు భూముల అక్రమంగా లాక్కోవడం వాటిని వెంచర్లకు వాడుకోవడం అందిన కాడికి ఎవడికి వాడే నేనే రాజు నేనే మంత్రి అనే తీరుగా ప్రవర్తించారు, “దోచుకో– దాచుకో” అదే ఫార్ములా పాటించిన నాయకులు, గతంలో ఇంటిలిజెన్సీ వారికి మీడియా వారు ఇదే సమాచారాన్ని అందజేస్తే ఆ ప్రభుత్వం తప్పును సరిదిద్దుకోకపోవడం వలన ఓటమిపాలైంది, ప్రస్తుత పాలకులలో పరిస్థితి కూడా క్రింది స్థాయి నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఏడాది కాలానికే ప్రజల్లో విసుకు పుట్టించేలా ప్రవర్తిస్తున్నారు. అక్రమంగా మట్టి అమ్ముకోవడం ఇసుక అమ్ముకోవడం మైనింగ్ క్వారీల దగ్గర లంచాలు తెచ్చుకోవడం ఇలాంటి వాటిపై దృష్టి పెడుతున్నారు కానీ ప్రజలకు మేలు చేద్దామని ఆలోచన ఒక్కరికి లేదు?, గ్రామంలో పార్టీ తరఫున గ్రామ నాయకుడు యంపరాల కిష్టయ్య ట్రాక్టర్లను తోలకాలు అప్పగించారు మట్టి తోడడానికి ప్రోక్లైన్ కుంభ సుబ్బారావు అప్పగించడం జరిగింది వీరి ఇరువురు వీరి స్వార్థానికి ఇష్టానుసారంగా తోలకాలు నిర్వహిస్తున్నారు, గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి విడుదల రజిని పై హైకోర్టుకు వెళ్లి హైకోర్టు వారు స్టేటస్కో ఆ భూములకు ఇచ్చివున్నారు, స్టేటస్కోలో ఉన్న దళిత ఎస్సీ రైతుల డీకే పట్టా భూములలో33/3,552,547,548, అక్కడక్కడ కుంతలు తవ్వి మట్టిని వెంచర్లకు హైవే లకు ఇతర అవసరాలకు అమ్ముకొంటున్నారు సుమారుగా ఒక ట్రాక్టర్ మట్టి 2000 రూపాయలకు విక్రయిస్తున్నారు ఇలా హైకోర్టులో స్టేటస్కోలో ఉన్న భూముల భాగంలో 100 ట్రక్కులు మట్టిని తోలకాలు జరిగించారు గ్రామంలో విచారించగా గ్రామస్థాయి నాయకుడు చెన్నుపాటి నాగరాజు ఆధ్వర్యంలో కుంభ సుబ్బారావు యంపరాల కృష్ణయ్యను అను వారు ఈ విధంగా చేస్తున్నారని తెలియజేస్తున్నారు వీరిపై విచారణ జరిగించాలని స్థానిక గ్రామ వీఆర్వో కోటేశ్వరావుని అడుగగా కోటేశ్వరరావు వారికి అండగా వారి వైపున మాట్లాడుతూ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నుపాటి నాగరాజు మీతో మట్టి తోలకాలు చేస్తామని చెప్పి చేస్తున్నారని వారికి వత్తాసు పలుకుతూ మాట్లాడుతున్నాడు అంటే వీరందరికీ విషయం తెలిసు?, హైకోర్టులో ఉన్న భూములని తెలిసినా కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు అధికారం అడ్డం పెట్టుకొని పార్టీని ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు అదేమంటే పైనుంచి మాకు అధికార బలం అండదండలు ఉన్నాయి అడిగితే అడిగిన వారిని బెదిరించడం తప్పుడు కేసుల పెట్టడం జరుగుతుంది, గత ప్రభుత్వంలో గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు అలా ప్రవర్తించి చివరికి వారి నాయకురాలు ఇక్కడ ఎన్నికలలో పోటీ కూడా చేయకుండా వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది, గత ప్రభుత్వం నాలుగేళ్లకు మిచ్చిన తరువాత మితిమిచ్చి ప్రవర్తించారు ప్రస్తుతం మన తెలుగుదేశం పార్టీ పాలనలో సంవత్సరం కాలంలోనే గ్రామాలలో ఈ పరిస్థితి ఈ విధంగా నెలకొందని ప్రజలందరూ వాపోతున్నారు, గ్రామాలలో ఈ విధంగా గ్రామస్థాయి నాయకులు వ్యవహరించడం వలన పూర్తిగా పార్టీ ప్రతిష్టలు దెబ్బ తినే విధంగా వ్యవహరిస్తున్నారు ఇది సీఎం నారా చంద్రబాబు నాయుడు వారి దృష్టికి వెళితే తప్ప ఈ పరిస్థితులు మారమని రైతులు గ్రామ ప్రజలు వాపోతున్నారు హైకోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా ప్రవర్తించే వీరిపై మైనింగ్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు వెంటనే వీరిపై చర్యలు తీసుకోవాలని వీరిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని దళిత రైతులు కోరుతున్నారు.