NNR రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్న దారపనేని
కనిగిరి సాక్షిత : రాజధాని అమరావతి లోని మందడం గ్రామంలో నూతనంగా నర్రా నారాయణ స్థాపించిన NNR రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్రా నారాయణ దారపనేనికి దుశ్యాలవతో సన్మానించి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దారపనేని మాట్లాడుతూ చిన్ననాటి, చిరకాల మిత్రులైన నర్రా నారాయణ కనిగిరి ప్రాంతానికి సుపరిచితుడని, నారాయణ వ్యాపార సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, నారాయణ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గల్లా శ్రీనివాసరావు, వంగా నాగిరెడ్డి, నూతంగి లక్ష్మీనారాయణ, బాల కాయల గోపాలరావు, కనిగిరి, ఉదయగిరి ప్రాంత వాసులు, పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, సన్నిహిత మిత్రులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని నర్రా నారాయణకు అభినందనలతో పాటు శుభాకాంక్షలు తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
