చిలకలూరిపేట చెందిన సుధాకర్ కు కాకినాడ స్పెషల్ గ్రేడ్ కమిషనర్ గా పదోన్నతి

Sakshitha news

చిలకలూరిపేట చెందిన సుధాకర్ కు కాకినాడ స్పెషల్ గ్రేడ్ కమిషనర్ గా పదోన్నతి

శుభాకాంక్షలు తెలియజేసిన చేసిన మిత్రులు

కాకినాడ నగరపాలక సంస్థ లో అదనపు కమిషనర్ గా పనిచేస్తున్న కె.టి సుధాకర్ కు పదోన్నతి లభించింది. స్పెషల్ గ్రేడ్ కమిషనర్ గా పదోన్నతి కల్పిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు -జారీ చేశారు. సోమవారం సాయంత్రం రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ జారీచేసిన ఆదేశాలలో గ్రేడ్ వన్ కమిషనర్ గా ఉన్న పలువురిని పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులుజారీ చేశారు.

మున్సిపల్ కమిషనర్ స్పెషల్ గ్రేడ్గా పదోన్నతిపై, కె.టి ప్రస్తుతం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో అదనపు కమిషనర్గా పనిచేస్తున్న సుధాకర్ను కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో అదనపు కమిషనర్గా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అదనపు కమిషనర్ కెటి సుధాకర్ ను కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

చిలకలూరిపేటకు చెందిన సుధాకర్ కు పదోన్నతి రావడంతో చిలకలూరిపేట లోని మిత్రులు, జర్నలిస్ట్ మస్తాన్ వలి పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Scroll to Top