SAKSHITHA NEWS

Nitro Star Sudheer Babu, Gnanasagar Dwarka, SSSC Pan India Movie Title ‘Harom Hara

నైట్రో స్టార్ సుధీర్ బాబు, జ్ఞానసాగర్ ద్వారక, ఎస్‌ ఎస్‌ సి పాన్ ఇండియా మూవీ టైటిల్ ‘హ‌రోం హ‌ర‌’

నైట్రో స్టార్ సుధీర్ బాబు18వ చిత్రానికి యూత్ ఫుల్ ఎంటర్‌ టైనర్ సెహరితో ఆకట్టుకున్న ట్యాలెంటడ్ దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. తన రెండవ సినిమా కోసం భారీ కాన్వాస్‌  తో కూడిన కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాడు దర్శకుడు. ఎస్‌ ఎస్‌ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

“అక్టోబర్ 31న మాస్ సంభవం” అని ఇటీవల ప్రకటించిన నిర్మాతలు.. బిగ్ అప్డేట్ తో వచ్చారు. ఈ చిత్రానికి ‘హ‌రోం హ‌ర‌’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ ను లాక్ చేసారు. ది రివోల్ట్ అనే ట్యాగ్ లైన్ కూడా వుంది. టైటిల్ ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ, ట్యాగ్‌లైన్ కథలోని ప్రతీకార కోణాన్ని తెలియజేస్తోంది.

కాన్సెప్చువల్ టైటిల్ వీడియో సినిమా సెట్టింగ్, బ్యాక్‌డ్రాప్, గ్రాండ్ స్కేల్ ని తెలియజేస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి కథ ఇది. సుబ్రమణ్య స్వామి ఆలయం, జగదాంబ టాకీస్,  రైల్వే స్టేషన్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలు వీడియోలో చూపించారు. ఈ వీడియో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో సుధీర్ బాబుని ప్రజంట్ చేసింది. “ఇంగా సెప్పేదేం లేదు… సేసేదే…” అని సుధీర్ బాబును చిత్తూరు యాసలో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.

టైటిల్ వీడియో ఆద్యంతం అద్భుతంగా ఉంది. చివర్లో సుధీర్ బాబు మాస్ గెటప్ గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ సినిమా కోసం సుధీర్ బాబు కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్స్ ఇచ్చింది.

ఈ చిత్రానికి అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, రమేష్ కుమార్ జి సమర్పిస్తున్నారు.

‘హరోం హర’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలలో పాన్ ఇండియా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

తారాగణం: సుధీర్ బాబు

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: జ్ఞానసాగర్ ద్వారక

నిర్మాత: సుమంత్ జి నాయుడు

సమర్పణ – రమేష్ కుమార్ జి

సంగీతం: – చైతన్ భరద్వాజ్

డీవోపీ – అరవింద్ విశ్వనాథన్

బ్యానర్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్

పీఆర్వో: వంశీ-శేఖర్


SAKSHITHA NEWS