ప్రజలను చైతన్యం చేసేది పత్రికలే
జనసేన పార్టీ యువనాయకులు మండలనేని చరణ్‌తేజ
నూతన సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరించిన చరణ్‌తేజ
చిలకలూరిపేట:
పత్రికలు చైతన్య దీపికలని జనసేన పార్టీ యువ నాయకులు మండల నేని చరణ్‌తేజ అన్నారు. వివిధ దినపత్రికల నూతన సంవత్సర క్యాలెండర్లను మంగళవారం ఆయన కార్యాలయంలో పార్టీ నాయకులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చరణ్‌తేజ మాట్లాడుతూ సమాజం పట్ల గౌరవంతో, ప్రజల పట్ల నిబద్ధతతో పని చేస్తున్న పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధుల్లా పనిచేస్తున్నాయని చెప్పారు. పత్రికల ద్వారా ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి సమర్థవంతమైన పరిపాలన అందించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే పత్రికలు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు..
పత్రికల యొక్క సామాజిక బాధ్యత అసమానమైనదని వివరించారు.సామాజిక బాధ్యత నిర్వర్తించడానికి పత్రికలకు స్వేచ్ఛ అత్యవసరమని,. పత్రికలకు స్వేచ్ఛ ఉన్నప్పుడే ప్రజల సాధకబాధకాలు తెలపడంతో పాటు ప్రభుత్వం పని విధానాన్ని సమీక్షించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్చకు కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.