SAKSHITHA NEWS

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పాపమ్మ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ ముఖద్వారంను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పాపమ్మ కాలనీ లో కాలనీ ముఖ ద్వారం ప్రాంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని,కాలనీ ముఖద్వారం కాలనీ కి చిరునామాకు సంకేతంగా ఉపయోగపడుతుంది అని,కాలనీ కి గుర్తుగా తోడ్పడుతుంది అని , ప్రజలకు ఉపయోగకరంగా ఉంటది అని , పాపమ్మ కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని కాలనీ ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ,కాలనీ,ఆల్విన్ కాలనీ డివిజన్ ను మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కి శాయశేక్తుల కృషి చేస్తానని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, అనిల్ రెడ్డి, జిల్లా గణేష్, మరేళ్ల శ్రీనివాస్, కాశినాథ్ యాదవ్, షౌకత్ అలీ మున్నా, మల్లేష్, నాగరాజు, ఖలీమ్, గణేషన్,

కాలనీ వాసులు పాపమ్మ, రాంచందర్, వేలు, రాము, కృష్ణ, త్రినాథ్, వెంకటరావు, మాధవరావు, శ్రీను, కుమార్, నరేందర్, నందు, రామరాజు, జీవన్, రామకృష్ణ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS