SAKSHITHA NEWS

యాదాద్రి భువనగిరి జిల్లా :-

రామన్నపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న.,

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి, DCCB చెర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు :-

స్వంత నిధులతో భవనాన్ని నిర్మించుకున్న సంఘం సభ్యులకు ధన్యవాదాలు. ఎమ్మెల్యే వినతి మేరకు రామన్నపేట వ్యవసాయ మార్కెట్ ను ఉప మార్కెట్ నుండి మార్కెట్ ఏర్పాటు చేస్తాం

BRS ప్రభుత్వంలో కేంద్రం నుంచి వచ్చే ఏ పథకాన్ని గ్రాంట్ లను అమలు చేయకపోవడం వల్ల సుమారు 7 కోట్ల రూపాయలు సహకార సంఘాల నష్టపోయాయి.చేనేత సంఘాల పెండింగ్ నిధులను త్వరలోనే మంజూరు చేస్తాం. చేనేత ద్వారా తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ ఆడబిడ్డలకు నాణ్యమైన చీరలు అందిస్తాం

చేనేత వృత్తిమీద బ్రతికే కుటుంబాలు ఇబ్బందులు ఉండకూడని రైతు రుణాల మాదిరిగా వాల్ల రుణాలను కూడా ఈ ప్రభుత్వం మాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది

వడ్ల కొనుగోలులో మిల్లర్స్ తో మాట్లాడి వాళ్లకు మిల్లింగ్ చార్జీలు పెంచాం..రైతులు తేమ లేకుండా ధాన్యం, పత్తిని తీసుకురావాలని ప్రతి గింజను ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇస్తున్న…

సహకార సంఘాల అధ్యక్షులు…. రైతులు ఇబ్బంది పడకుండా పంట అమ్ముకునే విధంగా సహకరించాలి.

ఇప్పటి వరకు 22లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేశాం. రాష్టంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలోనే ఎక్కువ రుణమాఫీ జరిగింది.మిగిలిన వారికి డిసెంబర్ 9 లోపు రుణమాఫీ ఐతుంది…

దేశంలో ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలొనే రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంగా నిలువ బోతున్నాంపెండింగులో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, డిసెంబర్ 9 లోపు పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు…


SAKSHITHA NEWS