సూర్యాపేటలో నూతన ట్రాక్టర్ ప్రారంభం
…..
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలో హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవే సమీపంలోని సోనాలిక ట్రాక్టర్ షోరూంలో వట్టి కాంపాడు గ్రామానికి చెందిన బయ్య రామయ్య అనే కొనుగోలుదారుడు
సోనాలిక డిఐ -740111 మోడల్ గల నూతన ట్రాక్టర్ ను కొనుగోలు చేశారు. ఈ సందర్బంగా కొనుగోలుదారుడు బయ్య రామయ్య మాట్లాడుతూ తమ గృహ, వ్యాపార, వ్యవసాయ ఇతరత్రా అవసరాల నిమిత్తమై ట్రాక్టర్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. నూతన ట్రాక్టర్ తో వ్యవసాయం మరింత సులభంగా వేగవంతగా పనులు పూర్తిచేసుకోవడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయం పడ్డారు.