నవ తెలంగాణ, ఆంధ్రప్రభ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాగరాజు ….
నవ తెలంగాణ, ఆంధ్రప్రభ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
వర్ధన్నపేట టౌన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నవ తెలంగాణ, ఆంధ్రప్రభ నూతన సంవత్సర క్యాలెండర్‌ను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఆవిష్కరించారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రజా సమస్యలను బాధ్యతాయుతంగా వెలుగులోకి తీసుకువెళ్లడంలో పత్రికల సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. నవ తెలంగాణ, ఆంధ్రప్రభ వంటి విశ్వసనీయ దినపత్రికలు సత్యం, న్యాయం, అభివృద్ధి అంశాలను ప్రజలకు చేరవేస్తూ సమాజ హితానికి దోహదపడుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రజలకు చేరేలా మీడియా చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులోనూ ప్రజల గొంతుకగా నిలుస్తూ జర్నలిజం మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నవ తెలంగాణ, ఆంధ్రప్రభ యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు…
ఈ కార్యక్రమంలో టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
