పేదల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి…
బాధిత కుటుంబానికి రూ.2,50,000/-ల LOC కాపీని అందజేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హన్మకొండ జిల్లా: హన్మకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 66వ డివిజన్ పరిధిలోని హసన్పర్తి గ్రామానికి చెందిన పిథిమి నాగమణి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన రూ.2,50,000/- (రెండు లక్షల యాభై వేల రూపాయలు) విలువైన LOC కాపీని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు…
ఈ LOC ద్వారా హైదరాబాద్ నిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదల వైద్య అవసరాల విషయంలో అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, స్థానిక శాసనసభ్యుడిగా తన దృష్టికి వచ్చే ప్రతి అనారోగ్య సమస్యపై తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు…
అలాగే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేస్తూ, లక్షల రూపాయలు ఖర్చయ్యే ప్రైవేట్ ఆసుపత్రుల చికిత్సలకు వెళ్లి అప్పుల పాలుకాకుండా, ప్రభుత్వ నిమ్స్ వంటి ఆసుపత్రుల్లో తాను అందించే LOCల ద్వారా ఉచితంగా మెరుగైన వైద్యం పొందాలని సూచించారు…
ఈ సందర్భంగా బాధితురాలు పిథిమి నాగమణి కుటుంబ సభ్యులు, ఆపద్కాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తమ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు…
ఈ కార్యక్రమంలో ఆత్మకూరు AMC వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి తిరుపతి, 66 డివిజన్ అధ్యక్షులు కనపర్తి కిరణ్ కాంగ్రెస్ నాయకులు వీసం సురేందర్ రెడ్డి మాజీ సర్పంచి పుల్ల రవీందర్ గా రాజు జన్ను అశోక్ జన్ను రమేష్ రమంచ ఐలయ్య మార్కెట్ డైరెక్టర్ జాడి రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు….

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
