arani ఫించన్ల‌పై ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం మాట నిల‌బెట్టుకుంది

arani ఫించన్ల‌పై ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం మాట నిల‌బెట్టుకుంది

SAKSHITHA NEWS

arani సాక్షిత తిరుప‌తి నగరపాలక సంస్థ:ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ ప్ర‌కారం ఫించ‌న్ ల‌బ్దిదారుల‌కు నాలుగు వేల రూపాయ‌లు పంపిణి చేసిందని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు.

arani గ‌త మూడు నెల‌ల పెండింగ్ తో క‌లిపి ఏడు వేల రూపాయ‌ల‌ను ల‌బ్దిదారుల‌కు అందించి ఎన్డీఏ ప్ర‌భుత్వం పేద‌ల ప‌క్ష‌పాతి అని నిరూపించుకుంద‌ని ఆయ‌న చెప్పారు.

న‌గ‌రంలోని 35వ డివిజ‌న్ లో ఉద‌యం ఆరు గంట‌ల‌కే వికలాంగురాల‌కు నేరుగా ఆమె ఇంటి వ‌ద్దే ఆరు వేల రూపాయ‌ల న‌గ‌దును ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు అందించారు.

ఎమ్మెల్యే తో పాటు మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీషా , క‌మిష‌న‌ర్ అదితి సింగ్ , డిప్యూటీ మేయ‌ర్ ముద్రా నారాయ‌ణ‌, ఫించ‌న్ పంపిణీ లో పాల్గొన్నారు.

35వ డివిజ‌న్ లో ఫించ‌న్ పంపిణీ అనంత‌రం 44వ డివిజన్ లో తరువాత మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష ప్రాతినిథ్యం వ‌హిస్తున్న 27వ డివిజ‌న్ లోని గంగ‌మ్మ గుడి ప్రాంతంలో న‌గ‌దు ల‌బ్దిదారుల‌కు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పంపిణీ చేశారు.

అలాగే 5, 6, 7, 8, 9, 42, 43, 47, 48, 49, 30, 23, 24, 39 డివిజన్లలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పింఛన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని 102 వార్డు సచివాలయాల ద్వారా 19,343 మంది లబ్ధిదారులకు సుమారు పదమూడు కోట్ల ముప్పయ్ లక్షల పదహారు వేల ఐదు వందల రూపాయలు వివిధ కేటగిరుల ఫించన్ దారులకు నగదు పంపిణీ చేసినట్లు తెలిపారు.

పండుగ వాతావరణంలో పింఛన్లు పంపిణి జరిగిందని చెప్పారు.

గత ప్రభుత్వం ఇచ్చింది గోరంత.. ప్రచారం మాత్రం కొండంత అని ఆయన విమర్శించారు.

మూడు వేలు పించన్ ఇస్తామని విడతల వారీగా ఇచ్చి లబ్దిదారులను మోసం చేశారని ఆయన ఆరోపించారు.

ఆర్బాటానికి తావు లేకుండా లబ్దిదారులకు నగదు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమని ఆదేశించినట్లు ఆయన చెప్పారు.

ఒకేసారి పెంచిన ఫించన్ డబ్బు లబ్దిదారులకు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన చెప్పారు.

ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆర్.సి.మునికృష్ణ, నారాయణ, రేవతి, కల్పనా యాదవ్, ఉప కమిషనర్ అమరయ్య, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, డి. ఈ. విజయకుమార్ రెడ్డి, శ్రావణి, గాలి సుధాకర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

arani

SAKSHITHA NEWS