కొండకల్ గ్రామంలో నవధుర్గా ఆత్మజ్ఞాన శక్తి ప్రాప్తి ధ్యాన యజ్ఞం
శంకర్పల్లి :అక్టోబర్ 13:(సాక్షిత న్యూస్ )కొండకల్ గ్రామంలో 41 రోజుల పాటు నవధుర్గా ఆత్మజ్ఞాన శక్తి ప్రాప్తి ధ్యాన యజ్ఞం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. ఈ యజ్ఞానికి సంబంధించి చివరి రోజున భవానీ కమిటీ కంకణదారులు ప్రత్యేక శాంతి హోమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా నవధుర్గా శక్తి పీఠం నిర్మాణ సంకల్పం గురించి ప్రాథమిక పూజారి మాట్లాడుతూ, తమ 7వ వయస్సులో అమ్మవారి సందేశం ప్రకారం ఈ శక్తి పీఠాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. “నేను అమ్మవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. ఈ పీఠం గ్రామానికి ప్రత్యేకమైన పవిత్రతను కలిగిస్తుందని, భక్తుల ఆత్మజ్ఞానానికి ప్రేరణగా మారుతుందని ఆయన అభిప్రాయించారు.యజ్ఞం ప్రారంభమైనప్పటి నుంచి గ్రామంలో భక్తి భావనలు, ఆధ్యాత్మికత పెరిగాయని స్థానికులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో సాంఘిక ఐక్యతను పెంపొందించడమే కాక, ఆధ్యాత్మిక మార్గంలో అనేకులకు మార్గనిర్దేశన లభించిందని వారు తెలిపారు. భవానీ కమిటీ సభ్యులు, పూజారులు, మరియు గ్రామస్థులు అందరూ కలిసి ఈ యజ్ఞాన్ని విజయవంతంగా జరిపినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు