SAKSHITHA NEWS

జిల్లాలో నాటు సారా పట్టివేత
సాక్షిత వనపర్తి : జిల్లాలోని చిట్యాల వద్ద 10 లీటర్ల నాటు సారాను వనపర్తి ఎక్సైజ్ ఎస్సై సంధ్యారాణి పట్టుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు వనపర్తి మండలం చిట్యాల దగ్గర తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో చిట్యాల పడమటి తండా నుండి చిట్యాల గ్రామానికి 10 లీటర్ల నాటు సారాను తరలిస్తున్న కేతావత్ దీప్లాను అదుపులోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్సై సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సారా తయారుచేసిన, విక్రయించిన వారిపై కేసులు నమోదు చేస్తామని వనపర్తి ఎక్సైజ్ ఎస్సై సంధ్యారాణి హెచ్చరించారు.


SAKSHITHA NEWS