SAKSHITHA NEWS

కొండాపూర్ RTA కార్యాలయంలో ఘనంగా జరిగిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం 2025 ముగింపు వేడుకలు

ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ను ఊపి రోడ్డు భద్రత అవగహన ర్యాలీ ని ప్రారంభించిన గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

మాదాపూర్ డివిజన్ పరిధిలోని భిక్షపతి నగర్ కాలనీ లో గల కొండాపూర్ RTA కార్యాలయంలో జరిగిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం 2025 ముగింపు వేడుకల కార్యక్రమంలో భాగంగా జరిగిన అవగహన ర్యాలీ లో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సదానందం , కొండాపూర్ RTA మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్ , నవీన్ , శ్రీమతి కృష్ణవేణి , డ్రైవింగ్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు, వాహన దారులు, నాయకులతో కలిసి పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత అవగహన కలిగి ఉండాలని,
రహదారి భద్రతా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అని,ఇలాంటి అవగాహన ర్యాలీల వలన ప్రజలలో చైతన్యం వస్తుంది అని, ప్రతి ఒకరికి ఉపయోగపడేలా ఈ ర్యాలీలు తోడ్పడతాయి అని, జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం 2025 ముగింపు వేడుకలు నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం అని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత పై అవగహన కలిగి ఉండాలని ,రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు చదువుకునే వయసులో రోడ్డు భద్రత అవగహన అంశాలు బోధిస్తే భవిష్యత్తులో తప్పనిసరిగా రోడ్డు భద్రత నిమాయలు పాటిస్తారు అని,

ద్విచక్రవాహనాలు నడిపే
ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మీ కోసం మీ ఇంటి వద్ద మీ కుటుంబం ఎదురుచూస్తుంది అనే విషయం గుర్తించుకోవలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

మద్యం తాగి వాహనాలు నడిపి మీ కుటుంబానికి నష్టం చేయవద్దు అని, మిమ్మల్ని చైత్యన్యం చేయడానికే ఈ రోడ్డు భద్రత మాసోత్సవం అవగహన ర్యాలీ నిర్వహించడం జరిగినది అని, డ్రైవింగ్ సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను పాటించి నిర్దేశించిన వేగం మించకుండా వాహనాలను నడపాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

వాహన దారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే కుటుంబానికి అనగా ఉంటారని, వారి జీవితాలకు భరోసా ఉంటుంది అని, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాహన దారులు మాత్రమే వాహనాలను నడపాలన్నారు. ద్విచక్రవాహనం నడిపే వారు విధిగా హెల్మెట్ పెట్టుకోవాలని ,కార్లు నడిపే వారు విధిగా సీట్ బెల్ట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంచుకోవలన్నారు.ఇలాంటి అవగహన కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలియచేయడం మన బాధ్యత అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో RTA మోటార్ వెహికిల్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లు మనోజ్ కుమార్, శ్రీ ముఖి, స్వాతి ఉపాసిని నాయకులు ఉట్ల కృష్ణ, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అక్తర్, చాంద్ పాషా, ఉట్ల దశరథ్, తిరుపతి, గుమ్మడి శ్రీనివాస్,రాంచందర్, పితాని శ్రీనివాస్, రాజు, ఉమ ,జహీర్ ఖాన్, మహేష్, నూర్ కాలనీ వాసులు మరియు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app